Skip to main content

Namaste NRI

నాతో నేను ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన విజయేంద్రప్రసాద్‌

సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  నాతోనేను. పాపులర్‌ రైటర్ విజయేంద్రప్రసాద్‌ నాతో నేను ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఆ ప్రయాణం సరైన సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది.. అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. పోస్టర్‌లో ఓ వైపు సీరియస్‌ లుక్‌లో సాయికుమార్‌, మరోవైపు పిల్లాడు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంతికుమార్‌ తుర్లపాటి కథ, సంభాషణలు, స్క్రీన్‌ ప్లే అందిచడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు. సత్య కశప్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎల్లలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్‌నేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, భద్రమ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News