అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. ఫామ్‌లోని 90 శాతం గోవులను మృత్యువు కబళించింది. మృతిచెందిన ఒక్కో ఆవు సుమారు రూ.1.63 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక ప్రమాదంలో ఈ స్థాయిలో పశువులు మృతిచెందటం ప్రపంచంలోనే అత్యధికమని అంచనా. ఎరువుల ట్యాంక్ అతిగా వేడి కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-63.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-9.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-9.jpg)