నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించారనే చెప్పాలి. విమర్శకులు సైతం దసరా సినిమాను మెచ్చుకుంటున్నారు. మామూలు సినిమాలకు ఈ సినిమా కాస్త డిఫరెంట్. సింగరేణి గనుల నుంచి రైలులో వెళ్లే బొగ్గు దొంగతనం, ఊరి రాజకీయాలు, పాత్రల్లో నటులు జీవించడం ఈ సినిమాకు పట్టు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాను వంకబెట్టలేని స్థాయిలో తీశారు. సినిమా స్టోరీ చాలా సీరియస్‌గా ఉంటుంది. హాస్యం, పాటలు, మసాల కావాలనుకునేవారికి ఈ సినిమా నచ్చదు. కానీ వెరైటీ కోరుకునే వారికి నచ్చుతుంది. సినిమాలో దమ్ముంది. మెగా స్టార్ చిరంజీవి దసరా టీమ్‌ను ప్రశంసించారు. దసరా సినిమా చూశాను. చాలా గొప్ప సినిమా ఇది. నీ(నాని) నటన అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరు బాగుంది. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మహానటి కీర్తి సురేశ్ నటన అదిరిపోయింది. మొత్తంగా ఈ సినిమా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని అందించారు అని మెచ్చుకున్నారు.