యంగ్ అండ్ డైనమిక్ హీరోఅఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే మంచి ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది.ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేశారు.రామా కృష్ణా అనే పల్లవితో సాగే ఈ పాట బ్రేకప్‌ను సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో వస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా, హిప్‌హాప్ తమిళ స్వరపరిచారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటలో అఖిల్ కాషాయ దుస్తులు ధరించి ఓ సాధువులా కనిపిస్తున్నారు.ఈ పాటలో అఖిల్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.