Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ‌తంలో త‌న వ్య‌క్తిగ‌త న్యాయ‌వాదిగా ప‌ని చేసిన మైఖేల్ కొహెన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై అస‌త్య ప్ర‌చారానికి పాల్ప‌డి మైఖేల్ కొహెన్‌ కాంట్రాక్ట్ ఉల్లంఘించాడ‌ని ట్రంప్ ఆరోపించారు. ఒక పోర్న్‌స్టార్‌కు ర‌హ‌స్యంగా డ‌బ్బు చెల్లించి, అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నార‌న్న కేసులో ట్రంప్ అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌తంలో త‌న‌కు వ్య‌క్తిగ‌త న్యాయ‌వాదిగా ప‌ని చేసిన మైఖేల్ కొహెన్‌పై ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతోపాటు ఫ్లోరిడా ఫెడ‌ర‌ల్ కోర్టులో త‌న‌కు న‌ష్టం క‌లిగించినందుకు మైఖేల్ కొహెన్ రూ.4000 కోట్లు (500 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాల‌ని కోరుతూ దావా దాఖ‌లు చేశారు.

పోర్న్ స్టార్ స్టార్మీ డానియ‌ల్‌తో డొనాల్డ్ ట్రంప్ అనైతిక ఒప్పందం కేసులో మైఖేల్ కొహెన్ కీల‌క సాక్షి. అటార్నీ-క్ల‌యింట్ మ‌ధ్య సంభాష‌ణ‌ను సీక్రేట్‌గా ఉంచ‌డంలో త‌న వ్య‌క్తిగ‌త న్యాయ‌వాదిగా మైఖేల్ కొహెన్ విఫ‌లం అయ్యార‌ని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. త‌న‌పై ప‌లు బుక్స్‌, పాడ్‌కాస్ట్ సిరీస్‌, ఇత‌ర మీడియాల్లో త‌ప్పుడు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ల‌తో మైఖేల్ కొహెన్ కాంట్రాక్ట్ ఉల్లంఘించార‌ని ట్రంప్ ఆరోపించారు. కొహెన్ అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన తీరు తారాస్థాయికి చేర‌డంతో ట్రంప్‌కు కోర్టును ఆశ్ర‌యించ‌డం త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేక‌పోయింద‌ని, ట్రంప్ త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచార‌ణ‌తోపాటు త‌న‌కు జ‌రిగిన న‌ష్టానికి 500 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాల‌ని కొహెన్‌ను డిమాండ్ చేస్తూ దావావేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events