భారత దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠచడం గర్వకారణం అని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బీఆర్‌అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల సీఎం కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
కేంద్రం సమాఖ్య స్ఫూర్తి కి విరోదంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నదని వారు ఆరోపించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది దళితులపై దాడులు జరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణమని పేర్కొన్నారు. అట్టడుగు స్థానంలో ఉన్న దళిత సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్ అడుగడుగునా రాజ్యాంగ నిర్మాతను కొలుస్తూ అంబేద్కర్ చూపిన బాటలోనే పయనిస్తున్నారని అన్నారు.