ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని ఈ నెల 16 నుంచి తెరువనున్నారు. ఈ నెల 20 వరకు తొలుత స్థానిక భక్తులను మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తారు. వారంతపు లాక్‌డౌన్ నేపథ్యంలో శని, ఆది వారాల్లో భక్తులను అనుమతించరు. కాగా ఆగస్టు 23 నుంచి భక్తుల ప్రవేశాన్ని పునరుద్ధరిస్తున్నట్లు పూరీ జగన్నాథ దేవాలయ పరిపాలన విభాగం తెలిపింది. అయితే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ లేదా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా జగన్నాథ రథ యాత్రకు భక్తులను అనుమతించని సంగతి తెలిసిందే.