తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా తంగలాన్. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. పార్వతి, మాళవిక మోహనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, నీలం ప్రొడక్షన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో విక్రమ్ గత చిత్రాలకు భిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన వీడియోలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో పశుపతి మాసిలామణి, పార్వతి తిరువోతు కీలకపాత్రలలో నటిస్తున్నారు. 1880ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.