విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత రాధాకృష్ణ చేతుల మీదుగా చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రగతి ప్రింటర్స్ ఎండీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా చుక్కపల్లి సురేష్ క్లాప్‌నిచ్చారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్, ఎడిటర్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్ల, సంగీతం: అనిరుధ్ రవిచందర్. ఇలా ఎందరో ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.