Namaste NRI

ఆదిపురుష్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌

భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ని పోషిస్తుండగా, సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తున్నది. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌అలీఖాన్‌ ప్రతినాయకుడు లంకేష్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో సన్నీ సింగ్‌, దేవదత్త నాగే, వత్సల్‌ సేన్‌, సోనాల్‌చౌహాన్‌ ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ  చిత్రం  థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది నా రాముడి గాథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహానీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది రఘునందనుడి గాథ అంటూ రామదూత హనుమంతుడి మాటలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది.

అనంతరం సీతాపహరణం, వానరసేనతో శ్రీరాముడు లంకపై యుద్ధానికి బయలుదేరడం, రామరావణ యుద్ధం వంటి ఘట్టాలతో ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. సీత నాకు ప్రాణమే అయినా..ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అంటూ రాఘవుడి పాత్రలో ప్రభాస్‌ పలికిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక సాంకేతిక హంగులతో విజువల్‌ ఫీస్ట్‌లా ట్రైలర్‌ను రూపొందించారు. ఈ  చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పల్నాని, సంగీతం: అజయ్‌-అతుల్‌, నిర్మాతలు: టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, యూవీ క్రియేషన్స్‌, దర్శకత్వం: ఓంరౌత్‌. . జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events