అమెరికాలో ఒక వింత చేప పట్టుబడిరది. మనుషుల మాదిరిగా దంతాలు ఉండటమే దీని ప్రత్యేకత. నార్త్ కరోలినా సముద్ర తీరంలోని బీచ్‌లో తిరుగాడే కొందరు ఈ అరుదైన చేపను గుర్తించారు. దీనికి మనువుల వంటి పళ్లు ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. నార్త్ కరోలినాలోని చేపల స్ఠావరమైన నాగ్స్ హెడ్‌లో తొమ్మిది పౌండ్ల బరువున్న ఈ వింత చేప వారి కంటపడిరది. గొర్రె నోటిని పోలిన దీనిని షీప్ప్ హెడ్ ఫిష్‌గా గుర్తించారు. దాని నోట్లో అనేక పళ్లు వరుసలు ఉన్నాయి. గుల్లలు, నత్తలు వంటి వాటిని పళ్ల సహాయంతో అది నమిలి తింటుంది. షీప్ప్ హెడ్ చేపలు సాధారణంగా రాళ్లు, జెట్టీలు, దిబ్బలు, వంతెనల దగ్గర కనిపిస్తాయి. నలుపు, తెలుపు చారలు ఉండటంతో వాటిని కన్‌విక్ట్ ఫిష్ గా పిలుస్తారు.