Namaste NRI

నాగచైత‌న్య కస్టడీ అండర్‌ వాటర్‌ సీక్వెన్స్ మేకింగ్ వీడియో

అక్కినేని నాగచైత‌న్య నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కస్టడీ. వెంకట్ ప్రభు డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కృతిశెట్టి  మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. నాగచైత‌న్య ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, టీజర్‌, ట్రైలర్‌ ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.  కస్టడీలో కథానుగుణంగా వచ్చే అండర్‌ వాటర్‌ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సీక్వెన్స్ కోసం చైతూ టీం ఎలా కష్టపడింతో తెలియాలంటే ఈ వీడియోపై ఓ లుక్కేయాల్సిందే. కస్టడీ మూవీలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తుండగా,  వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో NC 22గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress