భారత్, చైనా సరిహద్దుల్లో గత ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈస్ట్రన్ లడాఖ్‌లోని గోగ్రా నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. గాల్వాన్ ఘర్షణ తర్వాత బోర్డర్‌లో రెండు దేశాల సైన్యాలు మోహరించాయి. రెండు దేశాల మధ్య ఇటీవల సైనిక చర్చలు జరిగాయి. తాజాగా 12వ రౌండ్ చర్చలు జరిగాయి. అక్కడ కుదిరిన ఒప్పందం ప్రకారం.. గోగ్రాలో ఉన్న తాత్కాలిక టెంట్లను రెండు దేశాల సైనికులు తొలగించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 4, 5 తేదీల్లో దళాలు శాశ్వత ప్రాంతాలకు వెళ్లాయి. తూర్పు లడాఖ్‌లోని గోగ్రా ప్రాంతంలో ఉన్న దళాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.