సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 18న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు అగ్ర హీరో నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ లడ్డూలా ఉంది. టైటిల్ కూడా జనాల్లోకి బాగా చేరిపోయింది. వేసవిలో ప్రతి ఒక్కరిని అలరించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. సంతోష్‌శోభన్ నటన నాకు బాగా నచ్చుతుంది.దర్శకురాలు నందినికి సంతోష్ రూపంలో మరో నాని దొరికాడు (నవ్వుతూ). ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-71.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-67.jpg)
వైజయంతీ మూవీస్ తనకు ఫ్యామిలీ లాంటిదని, ఈ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని దుల్కర్ సల్మాన్ ఆకాంక్షించారు. తన కెరీర్‌లో ఎన్నో ప్రత్యేకతలు కలబోసిన చిత్రమిదని హీరో సంతోష్ శోభన్ తెలిపారు. నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో మన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మామిడికాయ తిన్నంత అనుభూతి పంచుతుందీ చిత్రం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇంటిల్లిపాదిని మెప్పిస్తుంది అని చెప్పింది. ఈ సినిమా కోసం షావుకారు జానకి వంటి సీనియర్ నటులతో పనిచేయడం గర్వంగా ఉందని, సకుటుంబ కథా చిత్రంగా అలరిస్తుందని దర్శకురాలు నందిని రెడ్డి పేర్కొంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హను రాఘవపూడి, అనుదీప్, నరేష్ వీకే, చిత్ర కథానాయిక మాళవిక నాయర్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-67.jpg)