Namaste NRI

సురాపానం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వేణు ఊడుగుల

సంపత్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సూరాపానం. కిక్‌ అండ్‌ ఫన్‌ ఉపశీర్షిక. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటెంట్‌ మీద ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఉన్నతమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పేక్షకాదరణను చూరగొంటుందనే నమ్మకముంది అని తెలిపారు. నవ్విస్తూనే థ్రిల్‌ను పంచే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతప్‌ కుమార్‌, రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ రాయ్‌, విజయ్‌ ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు. అజయ్‌ఘోష్‌, ఫిష్‌వెంకట్‌, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం :భీమ్స్‌ సెసిరోలియా, నిర్మాత మధు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress