అమెరికాలో తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూజెర్సీలో నాట్స్ నిర్వహించిన టెన్నీస్ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన లభించింది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జరిగిన ఈ టోర్నమెంట్లో తెలుగు, తెలుగేతర ఆటగాళ్లు తమ సత్తా చాటారు. న్యూ యార్క్, న్యూ జెర్సీ రాష్ట్రాలనుండి మొత్తం 44 డబుల్స్ టీమ్స్ పాల్గొన్న ఈ టోర్నమెంట్ గత 5 వారాలుగా నిరాఘాటంగా సాగుతూ, నేడు ప్లేయిన్స్బోరో టౌన్షిప్ కోర్ట్ లలో ఫైనల్ లో పోటీ పడ్డారు.
ఎడిసన్ కు చెందిన చేతన్ చావ్డ, ఆనంద్ ఠాకూర్ డబుల్స్
ఛాంపియన్షిప్ తో పాటు, $1000 ల నగదు బహుమతి కూడా గెలిచారు. డబుల్స్ టోర్నమెంట్ లో సౌత్ బృన్స్విక్ కు చెందిన ప్రహ్లాద్ విష్ణుభొట్ల & రామచంద్రన్ పిలవులతిల్ రన్నరప్‌గా నిలిచి, $500.00 ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. USTA ర్యాంకింగ్ జట్లు ప్రభు లక్ష్మి శ్రీకాంత్ & ప్రకాష్ కోడె, రాజేష్ & తారాచంద్ వర్మ టోర్నమెంట్లో ఆడారు మరియు ఆట యొక్క ప్రమాణాలను పెంచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/ed1d1733-ca71-465b-84e5-b6151462811f.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-75.jpg)
టెన్నిస్ సింగిల్స్: 13 నుండి 25 సంవత్సరాల వయస్సు విభాగంలో టెన్నిస్‌ను ప్రోత్సహించాలని మరియు ట్రోఫీలు మరియు ప్రైజ్ మనీని గెలుచుకునే అవకాశాన్ని కల్పించాలని నాట్స్ కోరుకుంటోంది. సింగిల్స్ టోర్నమెంట్లో మొత్తం 26 మంది యువ ఆటగాళ్లు పాల్గొన్నారు. వసిష్ట లింగ సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ను, $1000 ప్రైజ్ మనీని కూడా గెలుచు గెలుచుకున్నారు. సాధిష్ట లింగ రన్నరప్‌గా నిలిచి $500 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/18e81656-1fb0-4eb7-91dd-629af788da6c.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-75.jpg)
నాట్స్ స్పోర్ట్స్ కమిటీ డైరెక్టర్ సరోజ సాగరం, కో డైరెక్టర్ చంద్రశేఖర్ కొణిదెల, చైర్ పర్సన్ శ్రీనివాస్ కొల్ల, ఆర్గనైజింగ్ సభ్యులు గోవింద్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ నీలం, శ్రీనివాస్ వెంకట్ రామన్, గణేశ్ పిల్లరశెట్టి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. USTA రాంక్ క్రీడాకారులు హేమంత్ కొల్లూరి, ప్రణవ్ వడ్డేపల్లి, బ్రైనెర్ ఏంజిలో, తనీష్ మురళి తమ ఆటలో అద్భుత ప్రదర్శన కనబరిచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-80.jpg)
ఈ టోర్నమెంట్ విజయవంతానికి తమ వంతు కృషి చేశారు. టెన్నీస్ టోర్నమెంట్లో విజేతలకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, కో కన్వీనర్ రాజ్ అల్లాడ, డిప్యూటీ కన్వీనర్ శ్రీహరి మందాడి, కో కోఆర్డినేటర్ రంజిత్ చాగంటి, సంబరాల కమిటీ ట్రెజరర్ చక్రధర్ వోలేటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ( మీడియా) మురళీ మేడిచెర్ల , కో డైరెక్టర్ చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ నాయకులు డా. సూర్యం గంటి, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుఱ్ఱం తదితరులు విజేతలకు బహుమతులు అందించారు. నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.