అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఇటీవలనే ఎన్నికల ద్వారా నూతన కార్యవర్గం ని ఎన్నుకున్న విషయం, లావు అంజయ్య చౌదరి అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన విషయం తెలుసిందే!.
తానా సంస్థ లో ఒక ముఖ్యమైన విభాగం అయిన తానా పౌండేషన్ కి చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ, సెక్రటరీ గా శశికాంత్ వల్లేపల్లి, ట్రెజరర్ గా శ్రీకాంత్ పోలవరపు లను ఫౌండేషన్ సభ్యులు ఎన్నుకున్నారు. 20 రోజుల తర్వాత తానా ఫౌండేషన్ కి నాయకత్వం ఎన్నిక కావడం పట్ల తానా సభ్యులు హర్షం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.