అగ్రరాజ్యంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. డెల్టా వేరియంట్ కారణంగా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. తాజాగా అమెజాన్ సంస్థ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న అమెరికాలోని తన ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు భారీ మొత్తంలో ఆఫర్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 14.9 కోట్లను కేటాయించిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడిరచింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తూ.. డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికి రూ.3.7 కోట్లను అమెజాన్ అందించనుందని తెలిపింది. తర్వాత ఆరుగురికి రూ.74 లక్షలు, మరో ఐదుగురికి కార్లు, వెకేషన్ ప్యాకేజీలను అందించనుందని తెలిపింది.