లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ ఖడ్గం అత్యధిక ధర పలికి అందర్ని అవాక్కయ్యేలా చేసింది. 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ ఖడ్గం భారీ ధరకు అమ్ముడుపోయింది. లండన్‌లోని బోన్హమ్స్ ఇస్లామిక్ ఆండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు ఉపయోగించిన ఖడ్గాన్ని వేలం వేయగా 1.40 కోట్ల పౌండ్లకు అమ్ముడుపోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.143 కోట్లు. ఈ ఖడ్గం 15 లక్షల నుంచి 20 లక్షల పౌండ్ల వరకు పలకొచ్చని అంచనా వేయగా దాదాపు 10 రెట్లు ఎక్కువ ధర పలికింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-37.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-33.jpg)
ఈ టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని మే 23న వేలం వేసినట్లు బోన్హమ్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఖడ్గాన్ని సొంతం చేసుకునేందుకు వేలంలో ముగ్గురు బిడ్డర్లు విపరీతంగా పోటీ పడినట్లు పేర్కొంది. చివరకు 14 మిలియన్ పౌండ్లకు ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని ఓ బిడ్డర్ దక్కించుకున్నట్లు బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ తెలిపింది. అయితే ఈ ఖడ్గాన్ని ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. తాము అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువ ధరకు ఖడ్గం అమ్ముడుపోయిందని ఆక్షన్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-34.jpg)