స్పందన పల్లి, యుగ్‌రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ది ట్రయల్. రామ్ గన్నీ దర్శకుడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ లేడీ ఓరియెంటెడ్ కథాంశమిది. భార్యాభర్తలు ప్రధాన పాత్రల్లో కుట్ర నేపథ్యంలో కథ నడుస్తుంది అన్నారు. ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత తెలిపారు. శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ టీజర్ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. మళయాలంలో ఎన్నో ఇంటరాగేషన్ ఫిల్మ్స్ వస్తుంటాయి. మన తెలుగులో ఆ జానర్ ఎందుకు లేదు అనుకుంటాను. ఈ టీజర్ చూస్తే ఆ జానర్ లో ఉంది. లైఫ్ లో కొన్ని కో ఇన్సెడెంట్స్ వర్కవుట్ అవుతాయి. ఈ చిత్రానికి అన్ని కో ఇన్స్ డెన్సెస్ వర్కవుట్ కావాలని కోరుకుంటూ ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్ దార, సంగీతం: శరవణ వాసుదేవన్, నిర్మాతలు: స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు, దర్శకత్వం: రామ్ గన్ని.