కార్తి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జపాన్. రాజు మురుగన్ దర్శకుడు. అడ్వెంచరస్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కార్తి నటిస్తున్న 25వ చిత్రమిది కావడం విశేషం. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జపాన్‌లో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంట్రో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తిని జపాన్‌గా పరిచయం చేశారు. హీరో, విలన్, కమెడియన్‌గా ఆయన పాత్ర మూడు భిన్న కోణాల్లో సాగింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-40.jpg)
జపాన్..మేడ్ ఇన్ ఇండియా అంటూ కార్తి చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. కార్తి మూడు భిన్న పార్శాలు కలిగిన పాత్రలో కనిపిస్తారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అని దర్శకుడు తెలిపారు. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్‌టైన్ మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా వీడియోతో ప్రకటించేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: రాజు మురుగన్.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-37.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-36.jpg)