వీసా పొందేందుకు మోసాలకు పాల్పడుతున్న భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియా యూనివర్సిటీలు నిషేధం విధించాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్‌కు చెందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ, వెస్టర్న్ సీడ్నీ యూనివర్సిటీలు నిరాకరించాయి. ఈ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో వీసా దరఖాస్తులను పంపిస్తున్నట్టు యూనివర్సిటీలు గుర్తించాయి.