Namaste NRI

మొన్న అమెరికా… నేడు లండన్‌లో కలకలం

ప్రధాని రిషిసునాక్ అధికార నివాసం  సెంట్రల్ లండన్‌లోని  10 డౌనింగ్ స్ట్రీటు గేట్లను బద్ధలు కొడుతూ ఓ కారు లోపలికి దూసుకువెళ్లింది. ఇప్పుడు లండన్‌లో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి కారును లోపలికి గేట్లు విరగగొడుతూ వెళ్లిన దూసుకువెళ్లనిచ్చిన వ్యక్తిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకరమైన, అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు, ఘటనలో ఎవరూ గాయపడనట్లు వెల్లడైంది. ఘటన వెంటనే వైట్‌హాల్ ప్రాంతపు ప్రధాన రాదారిపై వాహనాలను నిలిపివేశారు. ఈ వ్యక్తి ఎవరు? ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాడు? అనే వివరాలు దర్యాప్తు క్రమంలో వెలుగులోకి రానున్నాయి.

ఇటీవలే అమెరికాలో ప్రెసిడెంట్ బైడెన్ అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద కూడా ఇటువంటి ఘటన జరిగింది. అమెరికాలో వైట్‌హౌస్‌లోకి ట్రక్కుతో సాయివర్షిత్ దూసుకువెళ్లడం, బైడెన్‌ను అంతమొందించేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్లు , అరెస్టు తరువాత చెప్పడం ఈ యువకుడు తెలుగు వ్యక్తి కావడం సంచలనం అయింది. ఇప్పుడు లండన్‌లో భారతీయ సంతతి వ్యక్తి ప్రధాని రిషిసునాక్ నివాసం వద్ద జరిగిన ఘటన ప్రకంపనలకు దారితీసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events