Namaste NRI

విద్యార్థి వీసాలు వేగవంతం చేయండి

అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీలకు అతీతంగా 24 మంది సెనేటర్ల బృందం జో బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరింది. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న సమయంలోనూ వీసాల ప్రక్రియ మందకొడిగా సాగటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌కు  లేఖ రాసింది. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు రావటం దేశ ఉన్నత విద్యావ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొంది. ఓ వైపు పోటీ దేశాలు అంతర్జాతీయ విద్యార్థులు, స్కాలర్లకు స్వాగతం పలుకుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా సైతం స్థిరమైన కాన్సులర్‌ సేవలు అందించాలి. వీసా అర్హతకు ఉన్న మినహాయింపుల్ని పొడిగించాలి.  వర్చువల్‌ ఇంటర్వూలు వంటి ప్రత్యామ్నాయాలు పెంచాలి. వీసాలు జారీ చేసే సిబ్బంది ఎక్కువ గంటలు పనిచేసేలా చూడాలి. విదేవీ ఏజెన్సీలతో సమన్వయం పెంచుకోవాలి అని సెనేటర్లు కోరారు. ఈ పరిణామం అమెరికాలో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకుని వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 

                విద్యా సంవత్సరం ప్రారంభంలో తమకు అవకాశం వస్తుందాÑ లేదా అన్న మీమాంసలో విద్యార్థులున్నారు. తాజాగా సెనేటర్ల ఒత్తిడితో వీసాల జారీ వేగవంతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతర్జాతీయ విద్యావంతుల అసోసియేషన్‌ డేటా ప్రకారం 2018`19 విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. వీరంతా అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు 41 బిలియన్‌ డాలర్లను సమకూర్చారు. అందులో గణనీయమైన మొత్తాన్ని లక్ష మందికి పైగా భారతీయ విద్యార్థులే సమకూర్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events