హీరో శర్వానంద్, రక్షిత వివాహం కన్నుల పండుగగా జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బంధుమిత్రులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 2వ తేదీ నుంచి వీరి పెండ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఉదయం హల్దీ వేడుక, సాయంత్రం సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 9న హైదరాబాద్‌లో శర్వానంద్, రక్షిత రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. రక్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన కొత్త చిత్రంలో నటిస్తున్నారు. రామ్‌చరణ్, సిద్ధార్థ్, అదితీరావ్ హైదరి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్, హర్షిత్, హన్షిత తదితరులు వివాహానికి హాజరయ్యారు.