అమెరికాలోని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ఉండే తెరపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంబంధిత దృశ్యాలను చాలా సేపటివరకూ ప్రదర్శించారు. రాహుల్ న్యూయార్క్ పర్యటనకు ముందు ఈ బిల్‌బోర్డుపై భారత్ జోడో సన్నివేశాలు ప్రత్యక్షం అయ్యాయి. న్యూయార్క్ డౌన్‌టౌన్‌లోని కొన్ని వీధులలో కూడా స్క్రీన్లపై భారత్ జోడో యాత్ర దృశ్యాలను పదేపదే వెలువరించారు. ఇక్కడి భారతీయ సంతతికి చెందిన వారు ఈ భారత్‌జోడో యాత్ర క్లిప్పింగ్స్‌ను ఆసక్తితో చూశారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుని రాహుల్ గాంధీ పాల్గొనే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ భేటీకి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఈ దశలోనే టైమ్స్‌స్కేర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర క్లిప్పింగ్స్ ప్రసారం జరిగిందని వెల్లడైంది.