ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో (ఏటీఎఫ్) ఆధ్వర్యంలో సిడ్నిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిడ్ని హార్వే లోవే పెవిలియన్ – కాజిల్ హిల్సెలో ఏర్పాటు చేసిన తెలంగాణా కల్చరల్ నైట్ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పారామాటా మేయర్ సమీర్ పాండే, బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చిటిపల్లి, తెలంగాణ గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్‌లు హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-41.jpg)
తొలుత తెలంగాణ అమరులకు, జయశంకర్ సారు నివాళి అర్పించి తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సిడ్నీ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇనార్పొరేటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్ ను సురేంద్ర మోహన్ ఆవిషరించారు. ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ కడపర్తి మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం బాధ్యత వహించాలని కోరారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/ATF-NRI-Australia-1024x614.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-40.jpg)
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వాణి ఏలేటి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ముద్దం, కోశాధికారి వినయ్ కుమార్ యమ, పబ్లిక్ ఆఫీసర్ అశోక్ మలీష్, సాంసృతిక కార్యదర్శి విద్యారెడ్డి సేరి, సంయుక్త కార్యదర్శి మలిఖార్జున అవిరేణి, ఎస్‌బీడీఎఫ్ కార్యదర్శి వాసు టూటుకూరు, ఎస్‌బీడీఎఫ్ చైర్మన్ అనిల్ మునుగల, రామ్ గుమ్మడవాలి, అశోక్ మరం, కిరణ్ అల్లూరి, హేమంత్ గంగు, ప్రదీప్ సేరి, కావ్య రెడ్డి గుమ్మడవాలి, ప్రమోద్ ఏలేటి, సందీప్ మునగాల, శశి మానేం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 800 వందల మందికి పైగా హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-41.jpg)