బ్రిటన్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో పాటు జోర్డాన్ పర్యాటకులకు బంపరాఫర్ ప్రకటించింది. యునైటెడ్ కింగ్‌డమ్ తాజాగా కొత్త ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, జోర్డాన్ దేశస్థులకు ప్రయాణ వ్యయం సగానికి సగం తగ్గనుంది. ప్రస్తుతం యూఏఈ, ఒమాన్, కువైత్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి బ్రిటన్ వెళ్లే సందర్శకులు ఎలక్ట్రానిక్ వీసా వేవియర్ స్కీమ్ ప్రకారం ప్రతి విజిటర్ 137 దిర్హమ్స్ (రూ.3080) చెల్లిస్తున్నారు. అదే ఈ కొత్త ఈటీఏ పథకం ద్వారా కేవలం 45.50 దిర్హమ్స్ (రూ.1023) మాత్రమే ఖర్చు అవుతుంది.
ఇక జోర్డాన్ పౌరులు ప్రస్తుతం విజిట్ వీసా కోసం 456 దిర్హమ్స్ (రూ.10,252) చెల్లిస్తున్నారు. పైగా కొత్త ఈటీఏ పథకం ద్వారా పొందే విజిట్ వీసా రెండేళ్ల కాలపరిమితితో వస్తోంది. ఈ వ్యవధిలో పలుమార్లు ఇంగ్లండ్‌ను సందర్శించే వీలు కూడా కల్పించింది. ఇక ఈ కొత్త పథకం 2023 అక్టోబర్‌లో ఖతార్ జాతీయులకు అందుబాటులోకి రానుంది.