బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి భగవంత్ కేసరి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఐ డోంట్ కేర్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. టైటిల్‌ను ప్రకటించడంతో పాటు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చేతిలో ఖడ్గంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో బాలకృష్ణ పాత్ర సాగుతుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.