Namaste NRI

భోళా శంకర్‌ సంగీత్‌ వేడుక

చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ భోళా శంకర్ .వేదాళమ్‌ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి మెహ‌ర్‌ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ  చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కీర్తిసురేశ్‌ చిరంజీవి సోదరి పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో తమన్నా, చిరు, కీర్తిసురేశ్ కాంబోలో వచ్చే ఎనర్జిటిక్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారని, శేఖర్‌ వీజే ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నాడని ఇప్పటికే ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది.

తాజాగా ఈ సాంగ్‌ అఫీషియల్‌ న్యూస్‌ను షేర్ చేశాడు చిరంజీవి. తాజా పాట సంగీత్‌ సెర్మనీ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ పాటలో చిరు, తమన్నా, కీర్తిసురేశ్, సుశాంత్‌తోపాటు రఘుబాబు, ఇతర నటీనటులంతా చిందులేయబోతున్నారు. భోళా శంకర్ లో  మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events