జులై 7, 8 తేదీల్లో బలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరింపజేయడం మొదలుపెడతామని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పినట్టు రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు నేతలు సోచిలో సమావేశమైన సందర్భంగా పుతిన్ పై ప్రస్తావన చేశారు. రష్యాకు చెందిన అణు క్షిపణులను బలారస్‌లో మోహరింపజేయాలని, అవి రష్యా నియంత్రణలో ఉండాలనే ఒక ప్రణాళికకు గతంలో నేతలిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడు ఇదే తరహా ప్రకటన చేయగా దానిపై అమెరికా ఆచితూచి స్పందించింది. అణ్వాయుధాలను వినియోగించే ప్రణాళికలో రష్యా ఉందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-78.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-77.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-78.jpg)