టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. సామ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అమెరికన్ యాక్షన్ టీవీ సిరీస్‌కు హిందీ రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సమంతకు జోడీగా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం సెర్బియాలో జరుగుతోంది. దీంతో సమంత సహా చిత్రబృందం అంతా అక్కడే ఉంటున్నారు. ఇక రాష్ట్రపతి కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం సెర్బియా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సామ్ తన సిటాడెల్ బృందంతో కలిసి రాష్ట్రపతిని కలిసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. సెర్బియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.