పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఓజీ . సుజీత్ దర్శకత్వం. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెట్ లో అర్జున్ దాస్ జాయిన్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ దాస్.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే, ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే ఊహే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.