జీఎమ్మార్ హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అవార్డు వరించింది. భారత్‌లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయ విభాగంలో ఈ అవార్డు లభించింది. స్కైట్రాక్స్ ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్టు అవార్డులు 2021 లో బెస్ట్ రీజినల్ ఎయిర్‌పోర్టు ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డుతో పాటు సెంట్రల్ ఆసియా అవార్డును గెలుచుకున్నట్లు తెలిపింది. అవార్డు గెలుచుకోవడం ఇది మూడోసారి కావడం వివేషం. అలాగే ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాల్లో 71వ స్థానం నుంచి 64 స్థానానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో నిబద్ధతతో సేవలందించిన విమానాశ్రయ సిబ్బంది, భాగస్వాములందరికీ ఈ అవార్డు అంకితమన్నారు.