అమెరికాలోని టెక్సస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగర జనాభా 24 లక్షలు. ఆ నగరంలో అందుబాటులో ఉన్న ఐసీయూ బెడ్లు కేవలం ఆరు. వెంటిలేటర్లు 313. జులైతో పోల్చితో ఆస్టిన్‌లో ఆగస్టు మొదటి వారంలో దవాఖానలో చేరేవారి సంఖ్య 600 శాతం, ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య 570 శాతం పెరిగాయి. అమెరికా డెల్టా వేరియంట్ ఎంతటి ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టిస్తున్నదో చెప్పడానికి ఈ అంకెలే ఉదాహరణ. నగర ఆరోగ్యవిభాగం ఇప్పటికే కరోనాపై అత్యున్నత స్థాయి హెచ్చరికలు జారీ చేసింది. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరింది. డెల్లా కారణంగా అమెరికాలో రోజూ లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. డెల్టా ఉధృతి నేపథ్యంలో ప్రజలకు బూస్టర్ డోసులు వేయాలని ప్రముఖ వైద్య నిపుణులు ఆంథోనీ ఫౌచీ సూచించారు.