Namaste NRI

లియో లుక్‌ వచ్చేసింది

 తమిళ అగ్ర హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం లియో . లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయిక. మాఫియా కథాంశం నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో విజయ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్‌ సీరియస్‌ లుక్‌లో శక్తివంతంగా కనిపిస్తున్నారు.వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఆకాశాన్ని చూస్తున్న ఓ వ్యక్తి అరచేయి. ఊడి గాల్లో ఎగురుతున్న పళ్లు, విజయ్‌ చేతిలో సుత్తి, దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్‌ గ్యాంగ్‌ విజయ్‌ పై దాడి చేయడానికి వస్తే వాళ్ల అంతు చూసినట్లుగా కనిపిస్తుంది. పోస్టర్‌ చూస్తుంటే పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లా అతి భయానకంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ఫుల్‌ క్లారిటీ రావాలంటే ట్రైలర్‌ వచ్చే వరకు వెయిట్‌ చేయాలి.

ఈ ఫస్ట్‌లుక్‌ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.  సంజయ్‌ దత్‌, అర్జున్‌ కీలక పాత్రధారులు.  మరో యాక్షన్‌ ప్యాక్డ్‌ రోల్‌లో విజయ్‌ కనిపించబోతున్నారని చెబుతున్నారు. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ గత చిత్రాల తరహాలోనే డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. త్రిష కథానాయిక నటిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.  అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events