Namaste NRI

ప్రాజెక్ట్‌ కె లో కమల్‌ హాసన్‌

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రాజెక్ట్‌ K. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాలో కమల్ హాస్ నటిస్తున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

 వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈమూవీలో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ జాయిన్ అయ్యా రు. ఈ చిత్రంలో కమల్ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలియజేసింది చిత్రయూనిట్. ఇందులో కమల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ప్రాజెక్ట్ కే కోసం కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కమల్ విలన్ పాత్రలో నటించనున్నారని.. దాదాపు 20 రోజుల డేట్స్ కూడా కేటాయించారని తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే నాగ్ అశ్విన్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కోసం కమల్ హాసన్ కి దాదాపు రూ.100కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నట్టు సమాచారం. ఇది వాస్తవమా కాదా అనేది క్లారిటీ లేదు. జనవరి 12, 2024న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events