Namaste NRI

మత గురువు  షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలంతో ప్రధాని మోడీ భేటీ

భారత ప్రధాని నరేంద్రమోడీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటన సందర్భంగా  ఈజిప్టు మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా  సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం, తీవ్ర వాదాన్ని నిరోధించడంపై విస్తృతంగా చర్చలు జరిపారు. ప్రధాని మోడీ దార్ అల్‌ఇఫ్తా వద్ద ఐటిలో ఈజిప్టు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను నెలకొల్పడమౌతుందని తెలియజేశారు. భారత్ ఈజిప్టు దేశాల మధ్య బలంగా ఉన్న సాంస్కృతిక, ప్రజల సంబంధాలపై చర్చించారని, సామాజిక సామరస్యం, తీవ్ర వాద నిరోధంపై కూడా చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. సమన్వయం, బహుళత్వ సాధనలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని మత పెద్ద అభినందించారని చెప్పారు.

ఢిల్లీలో జరిగిన సూఫీ సదస్సుల్లో ఒక సదస్సులో మోడీని తాను కలుసుకోగలిగానని, ఈ రెండు సమావేశాల మధ్య భారత్‌లో గొప్ప అభివృద్ది కనిపించిందని మత పెద్ద షాకీ ఇబ్రహి అబ్దెల్ కరీం ఆలం తెలిపారు. ఈజిప్టు, భారత్ దేశాల మధ్య మతపరమైన స్థాయిలో పటిష్టమైన సహకారం ఉంటోందని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events