జగపతిబాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం రుద్రంగి. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని రసమయి బాలకిషన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో కాలకేయ ప్రభాకర్, ఆశిష్ గాంధీ, ఆశిష్ నందా, దివి వైద్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఇందులో జగపతి బాబు దొర పాత్రలో కనిపించబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. దొర క్రూరమైన పరిపాలన, అతని దౌర్జన్యాలు ప్రజలను పేదరికంలో, ఆకలిలో ఎలా పడవేసాయి. ఆ తర్వాత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎలాంటి తిరుగుబాటు చోటుచేసుకుంటుందనేది హింట్ ఇస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రుద్రంగిలో హై ఆక్టేన్ యాక్షన్ షాట్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. రుద్రంగి జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-250.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-249.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-249.jpg)