Namaste NRI

పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఉద్యమ కెరటాలు

చందు రాగం, హాసిని, ప్రీతి సుందర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ఉద్యమ కెరటాలు. పిడమర్తి రవీంద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రమిది. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన గీత రచయిత కాసర్త శ్యామ్‌ మాట్లాడుతూ గోరటి వెంకన్న గారితో కలిసి పాటలు అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

సంగీత దర్శకుడు బోలె షావలి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం నాకు గర్వంగా భావించి ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తానని చెప్పడం జరిగింది. హీరో చందు రాగం మాట్లాడుతూ ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పిడమర్తి రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

ఈ సినిమా దర్శకుడు పిడమర్తి రవీంద్ర మాట్లాడుతూ ఈ జనరేషన్ యువతకి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని తెలియజేయడానికి ఈ సినిమాను నిర్మిస్తున్నానని తెలుపడం జరిగింది. తెలంగాణ ఉద్యమం గొప్పతగాన్ని యువత తరానికి చెప్పడానికి ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా భోలే షావలి, పాటలని కాసర్ల శ్యామ్, గోరేటి వెంకన్న, డీవోపీ గా వెంకట్ హనుమ, సింగర్స్ గా మధు ప్రియ, వరం, డాన్స్ ని గణేష్ మాస్టర్, పీఆర్వో గా బాబు నాయక్, కో డైరెక్టర్ గా హనుమకొండ రమేష్, విజయ్, పబ్లిసిటీ డిజైనర్ గా వివరెడ్డి పని చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events