Namaste NRI

పుతిన్ హెచ్చరిక …  వారిపై చర్యలు

రష్యా అంతర్గత ఘర్షణలతో రక్తపాతం చోటు చేసుకోవాలని పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ కోరుకున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తిరుగుబాటు చల్లారిన తర్వాత ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తొలిసారి  సందేశం ఇచ్చారు. తాను రక్తపాతాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నానని ఆయనచెప్పారు. ఈ క్రమంలో వాగ్నర్ గ్రూపునకు క్షమాభిక్ష ప్రసాదించానని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటు మొదలైనప్పటినుంచి కూడా రక్తపాతాన్ని నివారించే దిశగానే నా చర్యలున్నాయి. రష్యన్ల దేశభక్తికి ధన్యవాదాలు. రష్యన్లు తమ సోదరులను చంపుకోవడమే పాశ్చాత్యులకు, కీవ్‌లోని నియో నాజీలకు, దేశ ద్రోహులకు కావాలి. వారు రష్యా సైనికులు పరస్పరం ప్రాణాలు తీసుకోవాలని కోరుకున్నారు. ఏ విధమైన వ్యవస్థీకృత సంక్షోభానికి చేసే ఏ ప్రయత్నమైనా, బెదిరింపులైనా చివరికి విఫలమవుతాయని ప్రజల సంఘీభావం తెలియజేస్తోంది అని పుతిన్ పేర్కొన్నారు. ఈ కుట్రకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events