ధనుష్ హీరో గా నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిపోయింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యుద్ధ భూమిలో ధనుష్ భారీ సైజు తుపాకీని చేతిలో పట్టుకుని ఉన్నాడు. అంతేకాకుండా చుట్టూ సైనికుల శవాలతో ఫస్ట్‌లుక్ పోస్టర్ వీర లెవల్లో ఉంది. లాంగ్ హేయిర్, గుబురు గడ్డంతో ధనుష్‌ను ఈ సినిమాలో సరికొత్తగా చూడబోతున్నట్లు పోస్టర్‌తో స్పష్టమయింది.
వరల్డ్ వార్ టైమ్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో కీలకపాత్రలో మెరవనున్నారు. జీ. వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జోతి బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.