రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్కంద అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ది ఎటాకర్ ఉపశీర్షిక. ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు అయిన స్కందను టైటిల్‌గా పెట్టామని చిత్ర బృందం పేర్కొంది. టైటిల్‌తో పాటు యాక్షన్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-22.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-22.jpg)
ఆలయం నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ వీడియో ఆకట్టుకుంటున్నది. నేను దిగితే మిగిలేది ఉండదు అంటూ రామ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, సమర్పణ: జీ స్టూడియోస్ సౌత్, పవన్‌కుమార్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-22.jpg)