ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాంబోతోంది. వీరిద్దరి కలయిలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలబోతగా అందరిని ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కలయిలో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-29.jpg)
గత మూడు చిత్రాలను తెరకెక్కించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ గీతా ఆర్ట్స్‌తో కలిసి ఈ తాజా సినిమాను నిర్మించబోతున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియోలో గత చిత్రాలకు మించి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక, పుష్ప సినిమాతో బన్ని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నేపథ్యంలో మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచాలు నెలకొన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-29.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-29.jpg)