కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో పదవిని చేపట్టాక ఈ నెల 19న పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన ఘనంగా స్వాగతం చెప్పేందుకు బీజేపీ రాస్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కిషన్ రెడ్డి ఈ నెల 18న తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం 19న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని కోదాడ చేరుకుంటారు. కోదాడ పర్యటన తర్వాత ఆ రోజు రాత్రి ఖమ్మంలో బసచేస్తారని, 20న మహబూబాబాద్, నర్సంపేట, ములుగు మీదుగా రామప్ప దేవాలయానికి చేరుకుంటారని పార్టీ నేతలు చెప్పారు. 21న జనగామ నుంచి యాదాద్రి ఆలయంలో స్వామి దర్శనం, అక్కడి నుంచి భువనగిరి, ఘట్‌కేసర్ మీదుగా హైదరాబాద్ పార్టీరాష్ట్ర కార్యాలయానికి కిషన్‌రెడ్డి చేరుకుంటారని వివరించారు.