విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హత్య. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. బాలాజీ కుమార్ దర్శకుడు. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్సినిటీ ఫిల్మ్ వెంచర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్లు. ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇన్విస్టిగేటివ్ డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోని ఈ చిత్రంలో కనిపిస్తారు అన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ర్టాల్లో సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.