అశ్విన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హిడింబ. అనిల్ కన్నెగంటి దర్శకుడు. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. సోమవారం రివర్స్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రతీ సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో ప్రజెంట్ చేస్తూ ట్రైలర్ ఆకట్టుకుంది. రెండు భిన్న కాలాల్లో జరిగే కథతో ట్రైలర్ ఆసక్తిని పంచింది. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఎంతో పరిశోధన చేసి ఈ కథ రాసుకున్నా. హిడింబ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలో తీసుకెళ్తుంది. చరిత్రను వెతుక్కుంటూ చేసే పరిశోధనాత్మక కథాంశమిది. సింబాలిక్‌గా ఉంటుందని రివర్స్‌లో ట్రైలర్‌ను చూపించాం అన్నారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. కథపై పూర్తి విశ్వాసంతో టీమ్ అందరం శ్రమించామని హీరో తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బి. రాజశేఖర్, సంగీతం: వికాస్ బాదిసా, నిర్మాణ సంస్థ: యస్‌వీకె సినిమాస్, దర్శకత్వం: అనిల్ కన్నెగంటి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.