తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ర్యాక్ బ్యాంక్ దుర్గామాత ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ బోనాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరలో ఆస్ట్రేలియాలోని ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. సంప్రదాయసిద్ధంగా బోనాలు, తొట్టెలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో పోతురాజుల ఆటపాటలు, యువకులు డోలు వాయిద్యాలతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకలను నిర్వహించిన తెలంగాణ బోనాలు సంస్థ నేతలు తెలంగాణ మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి, దీపక్‌లను వివిధ సంఘాల నాయకులు అభినందించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/c163826f-406b-4d5e-9087-6d19b3b60c06.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/fa3c6c8c-8b4a-45eb-99be-97acde3bd497.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/f16ed5e8-eac9-4ef0-9e4e-9230564a3325.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/ecca1020-4344-4d66-910a-2e4fc5bd82dc.jpg)