అగ్రనటుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో బంపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమాలో సుశాంత్, వెన్నెల కిశోర్, తరుణ్ అరోరా, మురళి శర్మ, బ్రహ్మాజీ, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మిల్కీ బ్యూటీ అనే పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటను సంజన కల్మంజేతో కలిసి మహతి స్వరసాగర్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్, తమన్నా స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది అన్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంభాషణలు: తిరుపతి మామిడాల.
