2011 నుంచి ఇప్పటివరకు 17.50లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఈ ఏడాది జూన్ వరకు 87,026 మంది దేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో వెల్లడించారు. అయితే, 2022లో అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా 2011 నుంచి 2023 మొదటి ఆరు నెలల వరకు ఏడాది వారీగా పౌరసత్వాన్ని వీడిన భారతీయుల గణాంకాలను ఆయన తెలియజేశారు.
